బాచుపల్లిలో చంద్రన్న కుంటను కాపాడిన హైడ్రా..1.14 ఎకరాల చుట్టూ కంచె నిర్మాణం

బాచుపల్లిలో చంద్రన్న కుంటను కాపాడిన హైడ్రా..1.14 ఎకరాల చుట్టూ  కంచె నిర్మాణం

జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలో సర్వేనెంబర్ 483లో ఉన్న చంద్రన్న కుంట చెరువును కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు కాపాడారు. కొంతకాలంగా కుంటకు సంబంధించిన 1.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి వాడుకుంటున్నారు. 

దీంతో నిజాంపేట్​జేఏసీ నాయకుడు ఆకుల సతీశ్ ఆధ్వర్యంలో చెరువు వద్ద ఇటీవల నిరసన వ్యక్తం చేశారు. దీనిపై వీ6 చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. స్పందించిన హైడ్రా అధికారులు ఆదివారం చెరువు చుట్టూ కంచెను నిర్మించారు.