కట్టవాగు, మంచుకొండ లిఫ్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ .. హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ

కట్టవాగు, మంచుకొండ లిఫ్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ .. హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ హైడ్రాలజీ క్లియరెన్సులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం అధికారులు జలసౌధలో స్టేట్ లెవెల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగులో వికారాబాద్ జిల్లా మైలార్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌రాంపల్లి వద్ద కట్టవాగు మీద చిన్న చెరువు నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం చెరువులకు నీటి సరఫరా కోసం వెంకటాయపాలెం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై మంచుకొండ లిఫ్ట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను నిర్మించాలని నిర్ణయించారు. 

సమావేశంలో నీటి లభ్యతపై విస్తృతంగా చర్చించిన కమిటీ.. ఈ ప్రాజెక్టులకు తగినంత నీరు అందుబాటులో ఉందని నిర్ధారించింది. రెండు ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్సులు మంజూరు చేసింది.