Women Special : హైపర్ పిగ్మెంటేషన్ నుంచి ఎలా రక్షించుకోవాలి

Women Special : హైపర్ పిగ్మెంటేషన్ నుంచి ఎలా రక్షించుకోవాలి

ఫేస్ ఫ్రెష్, క్లీన్ గా ఉండాలని ఎన్నో క్రీమ్ లు రాస్తుంటారు కొందరు. ఇంకొందరేమో అసలు వాటి గురించి పట్టించుకోరు. కానీ.. ఆడవాళ్లలో కనిపించే హైపర్ పిగ్మెంటేషన్ మాత్రం పట్టించుకోవాల్సిందే.. ఈ హైపర్ పిగ్మెంటేషన్ ఏంటి అంటారా..?

హైపర్ పిగ్మెంటేషన్ అంటే చర్మం అక్కడక్కడ ముదురు రంగులోకి మారడం. అది ముఖం మీద మచ్చలా ఉండిపోతుంది. ఈ మచ్చలు ముఖం మీదే కాకుండా శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు. ఒక్కోసారి ఒళ్లంతా హైపర్ పిగ్మెంటేషన్ బారిన పడి చర్మం ముదురు రంగులోకి మారొచ్చు. ఇందులో రకాలు కూడా ఉన్నాయి.

హైపర్ పిగ్మెంటేషన్ లో మెలస్మా మొదటి రకం. ఇది హార్మోన్ల మార్పు వల్ల వస్తుంది. ఈ రకమైన పిగ్మెంటేషన్ ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో పిగ్మెంటేషన్ పరార్ కనిపిస్తుంది. ఇది ముఖం లేదా పొట్ట మీద వచ్చే అవకాశముంది.

సన్ స్పాట్స్ అనేవి రెండో రకం హైపర్ గెంటేషన్ని చూపిస్తాయి. వీటిని లివర్ స్పాట్స్” అని కూడా పిలుస్తారు. ఎక్కువ సేపు ఎండలో తిరగడం వల్ల సన్ స్పాట్స్ వస్తాయి. ఇవి మామూలుగా ముఖం, చేతుల మీద కనిపిస్తాయి. 

తగ్గించే పద్ధతులు

  • చర్మాన్ని ఎక్కువగా రుద్దకూడదు. 
  • ఎండలోకి వెళ్లడం వల్ల ఎక్కువగా హైపర్ పిగ్మెంటేషన్ బారిన పడే అవకాశం ఉంది. 
  • కాబట్టి బయటకి వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా ఉండేలా బట్టలు వేసుకోవాలి.
  • బయటికి వెళ్లేటప్పుడు మామూలు క్రీమ్ రాసు కుంటే సరిపోదు.
  • అల్ట్రా వయొలెట్ కిరణాల్ని అడ్డు కునే యువిఎ, యువిబి క్రీమ్లు రాసుకోవాలి. 
  • సన్ స్క్రీన్ లోషన్ వాడకం తప్పనిసరి.