రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని : శ్రీలీల

రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని :  శ్రీలీల

‘పెండ్లిసందD’తో పరిచయమైన శ్రీలీల.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రవితేజకు జంటగా ఆమె నటించిన చిత్రం ‘ధమాకా’. త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌‌లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన 
ఈ మూవీ డిసెంబర్ 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘శ్రీలీల’ ఇలా ముచ్చటించింది. ‘గతంలో ‘హలో గురు ప్రేమకోసమే’లో ఓ హీరోయిన్‌‌ పాత్ర కోసం నన్ను సంప్రదించారు డైరెక్టర్ త్రినాథరావు. కానీ అది కుదరలేదు. తర్వాత ‘పెళ్లి సందD’ విడుదలకు ముందు ‘ధమాకా’ స్టోరీ చెప్పారు. నాకు ఎంటర్‌‌‌‌టైనర్స్‌ ఎక్కువ ఇష్టం కనుక వెంటనే ఓకే చెప్పా. ఇందులో ప్రణవి అనే పాత్రలో కనిపిస్తా. డ్యుయల్‌‌ రోల్‌‌లో ఉన్న ఇద్దరు హీరోలను ఇష్టపడుతుంది. 

ముగింపు ఎలా వుంటుందనేది ట్విస్ట్. రవితేజ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. కిక్, విక్రమార్కుడు సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు. అయితే కలిసి నటించడానికి మాత్రం చాలా టెన్షన్ పడ్డా. అయితే ఆయన చాలా మోటివేట్ చేస్తారు. దాంతో కాన్ఫిడెన్స్‌‌తో పాటు కంఫర్ట్ వచ్చింది. డ్యాన్సులు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఇక ప్రస్తుతం రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్‌‌లకు జంటగా ఒక్కో సినిమా చేస్తున్నా.  అలాగే బాలకృష్ణ గారి మూవీలో కూతురుగా నటిస్తున్నా. వారాహి ప్రొడక్షన్‌‌లోనూ ఒక మూవీ ఉంది. ఇంకొన్ని సినిమాలకు అనౌన్స్‌‌మెంట్స్ రావాల్సి ఉంది. ఇటు సినిమాలు చేస్తూనే మెడిసిన్‌‌ చదువుతున్నా. నేను బేసిగ్గా స్విచాన్ స్విచాఫ్‌ పర్సన్‌‌ని కనుక రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నా’.