ఆగస్టు 20న  దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ మూవీ రిలీజ్.. 

ఆగస్టు 20న  దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ మూవీ రిలీజ్.. 

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై నిర్మిస్తున్న చిత్రం ‘ఐ యామ్ గేమ్‌‌‌‌’.  బుధవారం ఈ మూవీ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.  ప్రస్తుతం డబ్బింగ్‌‌‌‌,  పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

దుల్కర్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 40వ సినిమా. ఇందులో తను అల్ట్రా స్టైలిష్, మాస్ అవతార్‌‌‌‌లో కనిపించనున్నారు. తన కెరీర్‌‌‌‌లో అత్యంత స్టైలిష్ మూవీ ఇదేనని దుల్కర్ చెప్పారు.  ఆంటోని వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తుండగా అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌లను డిజైన్ చేశారు. పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా సినిమా రిలీజ్ కానుంది.