అహంకారం కాదు, నాపై నాకున్న నమ్మకం.. నన్ను భారత జట్టులో చూస్తారు: రియాన్ పరాగ్

అహంకారం కాదు, నాపై నాకున్న నమ్మకం.. నన్ను భారత జట్టులో చూస్తారు: రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, ఓవర్ యాక్షన్ స్టార్ రియాన్ పరాగ్.. త్వరలోనే తనను భారత జట్టులో చూస్తారంటూ సంచలన ప్రకటన చేశాడు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో తాను భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని నమ్మకంగా చెప్పాడు. అయితే, అది ఎప్పుడనేది తనకు అనవసరమని తెలిపాడు. ఈ ప్రకటన పట్ల తనది అహంకారం కాదని, తనపై తనకున్న నమ్మకమని వెల్లడించాడు. 

ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో పరాగ్ మంచి ప్రదర్శన కనపరిచాడు. గతేడాది ఎక్స్‌ట్రాలు చేసి అభిమానులతో తిట్లు తిన్నా.. ఈ ఏడాది వాటన్నిటిని తన ఆటతీరుతో తుడిచి పెట్టాడు. 14 మ్యాచ్ ల్లో 52 సగటుతో 573 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో తనకు భారత జట్టులో చోటు దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.. పరాగ్. 

Also Read: ఒకేసారి వేలమందిని మట్టుపెట్టేలా ప్లాన్.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు ఉగ్రముప్పు!

"భారత జట్టు జెర్సీ ఒంటిపై పడాలి.. 10 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు మా నాన్న (రైల్వేస్, అస్సాం మాజీ ఆటగాడు పరాగ్ దాస్)తో అన్న మాటలవి. అనుకున్నట్లుగానే భారత్ తరఫున ఆడతాను. భారతదేశం కోసం ఆడబోతున్నాను. అదే నా లక్ష్యం.. అప్పటివరకూ వెనకడుగు వేయను.. అది తదుపరి పర్యటన అయినా, ఆరు నెలల్లో అయినా, ఒక సంవత్సరంలో అయినా.. నేను ఎప్పుడు ఆడాలి అనేది ఆలోచించను.. అది సెలెక్టర్ల పని. ఇలా చెప్పడం అహంకారం కాదు, అది నాపై నాకున్న నమ్మకం.." అని పరాగ్ చెప్పాడు. 

హీరోయిన్ల హాట్ ఫోటోల కోసం వెతుకులాట

కాగా, పరాగ్ ఇటీవల హీరోయిన్ల హాట్ ఫోటోల కోసం వెతికి విమర్శల పాలయ్యాడు. అనన్య పాండే హాట్.. సారా అలీ ఖాన్ హాట్.. ఇదీ ఈ యువ క్రికెటర్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ. బాలీవుడ్ హీరోయిన్ల బూతు ఫోట్లు, వీడియోల కోసం వెతికాడు. పరాగ్ ఇటీవల తన గేమింగ్ సెషన్ లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించగా ఈ సెర్చ్ హిస్టరీ బయటపడింది. కొందరు కావాలనే ఆ సమాచారాన్ని స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.