సారీ.. నేను రేసిస్ట్‌‌‌‌‌‌‌‌ను కాదు

సారీ.. నేను రేసిస్ట్‌‌‌‌‌‌‌‌ను కాదు

షార్జా: బ్లాక్‌‌‌‌‌‌‌‌ లైవ్స్‌‌‌‌‌‌‌‌ మ్యాటర్‌‌‌‌‌‌‌‌ (బీఎల్‌‌‌‌‌‌‌‌ఎం) ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని, టీ20వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో మిగిలిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు అందుబాటులో ఉంటానని సౌతాఫ్రికా క్రికెటర్‌‌‌‌‌‌‌‌ క్వింటన్​ డికాక్‌‌‌‌‌‌‌‌ తెలిపాడు. మోకాళ్లపై కూర్చొని బీఎల్‌‌‌‌‌‌‌‌ఎంకు మద్దతు తెలిపేందుకు నిరాకరించిన తను.. మంగళవారం వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్​కు దూరమై  తీవ్ర విమర్శల పాలయ్యాడు. దీనిపై డికాక్​ గురువారం క్షమాపణలు చెప్పుకున్నాడు. సౌతాఫ్రికా బోర్డు.. తన అభిప్రాయం తెలుసుకోకుండా బీఎల్​ఎంకు మద్దతు పలకాలంటూ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు కొద్దిసేపటి ముందు ఆదేశించడం బాధ కలిగించిందన్నాడు. తాను రేసిస్ట్‌‌‌‌‌‌‌‌ను కాదని, రేసిజమ్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు సిద్ధమని డికాక్​ స్పష్టం చేశాడు.