అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో ఎవరి బలాలు ఏంటో తెలుస్తాయి

అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో ఎవరి బలాలు ఏంటో తెలుస్తాయి

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అయితే ఈ సంక్షోభ సమయంలో ఉద్ధవ్ థాక్రేకు ఎన్సీపీ, కాంగ్రెస్ లు అండగా నిలుస్తాయని శరద్ పవార్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మైనార్టీలో పడలేదన్నారు. ఒక్కసారి రెబల్ ఎమ్మెల్యేలు ముంబయికి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని తెలిపారు. అసోంలో బలప్రదర్శన చేయడం కాదని.. ముంబయికి వచ్చి బలాన్ని ప్రదర్శించాలని సూచించారు. అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో ఎవరి బలాలు ఏంటో తెలుస్తుందని..తమ బలాన్ని అక్కడ చూపించాలని షిండేకు సవాల్ విసిరారు. 


మహారాష్ట్రలో ఇటువంటి సంక్షోభాలు ఎన్నో చూశానని..నా అనుభవంతో సంక్షోభాన్ని నివారిస్తానని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలందరినీ గుజరాత్, అస్సాంకు ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలిసిందేనని...అయితే వారి పేర్లను వెల్లడించనంటూ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. మరోవైపు గౌహతి క్యాంపులో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇక ఏక్ నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.