V6 News

ఐబొమ్మ రవి కేసులో... కస్టడీ రివిజన్ పిటిషన్పై తీర్పు వాయిదా

ఐబొమ్మ రవి కేసులో... కస్టడీ రివిజన్ పిటిషన్పై తీర్పు వాయిదా
  •     పెండింగ్​లో బెయిల్ పిటిషన్

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్​పై నాంపల్లి కోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. గతంలో ఒక కేసులో 8 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ తీసుకొని విచారించారు. మరో నాలుగు కేసుల్లో పోలీసులు కస్టడీ కోరడంతో.. న్యాయస్థానం నాలుగు రోజులు అనుమతి ఇచ్చింది. కానీ విచారణకు సమయం సరిపోదని, ఒక్కొక్క కేసులో ఐదు రోజులు కస్టడీ కావాలంటూ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.  రవి బెయిల్ పిటిషన్​ను న్యాయస్థానం పెండింగ్​లో పెట్టింది. కస్టడీ విచారణ పిటిషన్ పై తీర్పు వెలువడిన తరువాత బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం నిర్ణయం  తీసుకోనుంది.