సింహయాజి ఎలా ఉంటారో నాకు తెలియదు : దామోదర రాజనర్సింహ

సింహయాజి ఎలా ఉంటారో నాకు తెలియదు : దామోదర రాజనర్సింహ

తాను సింహయాజిని కలవలేదని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. అసలు ఆయనెలా కూడా తనకు తెలియదని తేల్చి చెప్పారు. ఎవరో కావాలని ప్రచారం చేశారన్న ఆయన.. కుట్రలు కొత్త కాదు.. గతంలో చాలా సార్లు తనపై ఇలాగే కుట్ర చేశారని ఆరోపించారు.

ఇక ఫామ్ హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింహయాజీతో ఉన్న సంబంధాలపై  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ సైతం క్లారిటీ ఇచ్చారు. ఆరు నెలల కిందట తాను సింహయాజిని కలిసింది వాస్తవమేనన్నారు. ఆయనను కలవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్న కోదండరామ్.. తిరుపతి నుండి వచ్చిన గురువుగా సింహయాజీని పరిచయం చేశారని చెప్పారు. ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని కోదండరామ్‌ స్పష్టం చేశారు.