Zeba Hassan: చరణ్ను అలా పిలిచి అవమానించడం నచ్చలేదు.. చాలా హార్ట్ అయ్యాను

Zeba Hassan: చరణ్ను అలా పిలిచి అవమానించడం నచ్చలేదు.. చాలా హార్ట్ అయ్యాను

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(Mukhesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్ నగర్ లో జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో దేశ, విదేశాల నుండి టాప్ సెలబ్రెటీస్ పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అందురు టాప్ స్టార్స్ ఈ వేడుకల్లో హల్చల్ చేశారు. ఇక టాలీవుడ్ నుండి మాత్రం కేవలం రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది. 

ఇక ఈ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బాలీవుడ్ ఖాన్స్ దిగ్గజాలు ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ డాన్స్ చేసి నా నా హంగామా చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ పాటలో నటించిన రామ్ చరణ్ కూడా ఆ వేడుకల్లో ఉండటంతో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను స్టేజిపైకి పిలిచి తనతో నాటు నాటు పాటకు స్టెప్స్ వేయించాడు. అది కూడా ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. 

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, నాటు నాటు పాట కోసం రామ్ చరణ్ ను స్టేజి పైకి పిలిచిన విధానం అస్సలు బాగోలేదట. ఆ సమయంలో రామ్ చరణ్ ను ఇడ్లీ, వడ అంటూ సంబోధించడం తనకు నచ్చలేదని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ అన్నారు. ఇదే విషయంపై ఆమె ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టారు. షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను స్టేజిపైకి పిలిచేప్పుడు ఇడ్లీ, వడ అంటూ సంబోధించడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా హార్ట్ అయ్యాను. అందుకే అక్కడినుండి వెళ్ళిపోయాను.. అంటూ రాసుకొచ్చారు జెబా. ప్రస్తుతం జెబా పెట్టిన పోస్ట్ వైరల్ అవగా.. మెగా ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు. మిమ్మల్ని వడాపావ్, భేల్ పూరి అని పిలిస్తే ఊరుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై షారుఖ్ ఎలా స్పందిస్తారో చూడాలి.