ఇక నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చ‌నిపిస్తోంది.. పొలిటికల్ రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు

ఇక నిశ్చింతగా రిటైర్ అవ్వొచ్చ‌నిపిస్తోంది.. పొలిటికల్ రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాను ఇప్పుడు పదవీ విరమణ చేయవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభకు ఝలావర్-బరన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ఇప్పటికే ప్రజాప్రతినిధిగా ముందుకు సాగుతున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఝలావర్‌లో జరిగిన బహిరంగ సభలో  మాట్లాడిన రాజే.. "నా కొడుకు మాటలు విన్న తర్వాత, మీరందరూ అతనికి బాగా శిక్షణ ఇచ్చారనిపిస్తోంది. కావున ఇక నేను నిశ్చింతగా రిటైర్ అవ్వాలని భావిస్తున్నాను" అని చెప్పారు. ''నేను ఇక అతడికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు. వారిపై పర్యవేక్షణ అవసరం లేకుండానే ప్రజల కోసం కష్టించి పనిచేస్తున్నారు'' అని రాజే వ్యాఖ్యానించారు.

రోడ్లు, నీటి సరఫరా ప్రాజెక్టులు, వాయు, రైలు కనెక్టివిటీని ప్రస్తావిస్తూ గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులను కూడా రాజే హైలైట్ చేశారు. బీజేపీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు కూడా పనిచేసినప్పుడే రాజస్థాన్ మళ్లీ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని రాజే చెప్పారు. ఆ రాష్ట్రంలో నవంబర్ 25 అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 200 స్థానాల కోసం జరుగుతున్న ఈ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.

ALSO READ :- ఆ రూమర్స్కు చెక్​ పెట్టిన సమంత..లేటెస్ట్ ఫొటోస్ వైరల్