V6 News

కొత్త వాళ్ల కెరీర్ సెట్ కావాలని కోరుకుంటున్నా.. తిమ్మరాజిపల్లి టీవీ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం

కొత్త వాళ్ల కెరీర్ సెట్ కావాలని కోరుకుంటున్నా.. తిమ్మరాజిపల్లి టీవీ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్‌‌ అబ్బవరం నిర్మాతగా అందరూ కొత్త వాళ్లతో నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటించగా,  వి.మునిరాజును దర్శకత్వం వహించాడు.  తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. ఏప్రిల్ 17న సినిమా విడుదలవుతోంది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘తిమ్మరాజుపల్లి అనే ఊరి నేపథ్యంలో థ్రిల్లింగ్‌‌గా, ఎంగేజింగ్‌‌ ఉండే సినిమా ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా మంచి సమ్మర్ వెకేషన్‌‌కు వెళ్లినట్లు ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఇది నా ప్రామిస్. చిన్న చిత్రాల్లో ఇది ఓ బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. 

తక్కువ బడ్జెట్‌‌లో టెక్నికల్‌‌గా ఇంత క్వాలిటీతో బ్రిలియంట్‌‌గా సినిమా తీయొచ్చా అని ఆశ్చర్యపోతారు. ఈ  సినిమాకు సపోర్ట్ చేయమని ఇండస్ట్రీని కోరుతున్నా. ఎందుకంటే కనీసం యాభై కుటుంబాల ఆశలు ఈ చిత్రంపై ఉన్నాయి. ఈ సినిమాకు నా పెట్టుబడి రాకున్నా, డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన డబ్బులు రావాలి. ఈ కొత్త వాళ్ల కెరీర్​ సెట్ కావాలని  కోరుకుంటున్నా.  కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం గొప్పగా కంటే బాధ్యతగా భావిస్తున్నా’ అని చెప్పారు. 

విలేజ్ లైఫ్‌‌ స్టైల్‌‌ తెలియని ఈ తరం జెన్‌‌ జీ కిడ్స్‌‌కు అక్కడి ట్రెడిషన్స్‌‌ను, ఒకప్పటి కల్చర్‌‌‌‌ను తెలియజేసే సినిమా ఇదని సీయీవో రహస్య కిరణ్‌‌ చెప్పారు.  హీరోహీరోయిన్స్‌‌, దర్శకుడితో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.