నేను.. నా టార్గెట్ రీచ్ అయ్యాను.. : చంద్రయాన్ 3 నుంచి తొలి మెసేజ్

నేను.. నా టార్గెట్ రీచ్ అయ్యాను.. : చంద్రయాన్ 3 నుంచి తొలి మెసేజ్

చంద్రుడిపై చంద్రయాన్ 3 దిగింది.. దిగిన తర్వాత ఎలా ఉంది.. సాఫ్ట్.. సేఫ్ ల్యాండ్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకున్నాం అంటే.. ఆ విషయం కూడా చంద్రయాన్ 3 చెప్పేసింది..

చంద్రుడి దక్షిణ దృవం వైపు దిగిన చంద్రయాన్ 3.. ఇస్రోకు తొలి సమాచారం ఇచ్చింది. ఏమనో తెలుసా.. నేను నా టార్గెట్ రీచ్ అయ్యాను.. ఐ రీచీడ్ మై డెస్టినేషన్ అనే సమాచారాన్ని ఇచ్చింది. దీంతో చంద్రయాన్ 3 సక్సెస్ అయినట్లు నిర్థారించారు ఇస్రో శాస్త్రవేత్తలు.

చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవటానికి.. దిగిన తర్వాత పని చేస్తుందా లేదా అనే విషయాన్ని నిర్థారించుకోవటానికి ఇస్రో ఓ సెన్సార్ అమర్చింది ఇస్రో. చంద్రుడిని టచ్ చేసిన తర్వాత.. అంతా బాగుంది అనుకుంటేనే ఇలాంటి మెసేజ్ వస్తుంది. ఇస్రోకు చంద్రయాన్ 3 నుంచి మెసేజ్ రావటంతో వందకు వెయ్యి శాతం ప్రయోగం సక్సెస్ అయినట్లే కదా.. ఆల్ ద బెస్ట్ ఇస్రో...