
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను ఎవరికీ భయపడి మూసేయడం లేదని ఈ సంస్థ ఫౌండర్ నాథన్ అండర్సన్ పేర్కొన్నారు. పని ఎక్కువ కావడంతోనే మూసేస్తున్నామని తెలిపారు. షేర్లను అదానీ గ్రూప్ మానిప్యులేట్ చేస్తోందని ఈ కంపెనీ 2023 జనవరిలో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీని దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు 70 శాతం వరకు అప్పుడు పడ్డాయి. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న గ్రూప్‌లతో, జార్జ్ సోరస్‌తో హిండెన్‌బర్గ్‌కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయని, ఇలాంటి ఆరోపణలకు స్పందించడం కంటే సైలెంట్‌గా ఉండడం బెటర్ అనే వీటిని పట్టించుకోలేదని నాథన్ అన్నారు.