‘బఘీరా’ తర్వాత కన్నడ స్టార్ శ్రీమురళి తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘పరాక్’ టైటిల్‌తో దీన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటిస్తూ.. బెంగళూరులోని బండి మహాంకాళి ఆలయంలో మంగళవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన హలేష్ కోగుండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రాండ్ స్టూడియోస్ నిర్మిస్తోంది.
ఈ సందర్భంగా శ్రీమురళి మాట్లాడుతూ ‘నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. ఈ కథ బాగా నచ్చింది. ఇదొక వింటేజ్ స్టైల్ సినిమా. ఈ నెల నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది. చరణ్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు’ అని చెప్పాడు.
ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా కన్నడలోకి ఎంట్రీ చేస్తూ రూపొందించిన మూవీ ఉగ్రం (2014). శ్రీమురళి హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ సినిమా ఉగ్రం తోనే నీల్ స్టార్ డైరెక్టర్గా మారాడు. ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ అనేలా ఉంటుంది. కేజీఎఫ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. తన సినీ ఎంట్రీకి సరైన హీరో ఇతనే అని చాలా సందర్భాల్లో నీల్ చెప్పుకొచ్చాడు.
"ಇವತ್ತು ನಮ್ಮ 'ಪರಾಕ್' ಚಿತ್ರದ ಮುಹೂರ್ತ ಬಂಡೆ ಮಹಾಕಾಳಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಡೆಯಿತು."
— #SRIIMURALI (@SRIMURALIII) September 29, 2025
Bullseye locked. Game on #PARAAK 🎯 pic.twitter.com/kPBj0xZOnA
