ఈడీకి సహకరించడం నా బాధ్యత 

ఈడీకి సహకరించడం నా బాధ్యత 

ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ముందు హాజరు కాబోతున్నట్లుగా శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ తన ట్వీట్‌లో తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను తాను గౌరవిస్తానని, దర్యాప్తు సంస్థకు సహకరించడం తన  బాధ్యతని వెల్లడించారు. అయితే శివసేన కార్యకర్తలు ఎవ్వరు కూడా ఈడీ కార్యలయం ముందు గుమిగూడవద్దని వద్దని  విజ్ఞప్తి చేస్తున్నట్టుగా సంజయ్ రౌత్ తన ట్వీట్ లో తెలిపారు. ఇది పూర్తి రాజకీయమేనన్న విషయం అందరికి తెలుసన్న రౌత్... ఓ దేశ పౌరుడిగా, ఎంపీగా కేంద్ర ఏజెన్సీ ముందుకు  వెళ్తానని అన్నారు.

అటు మహారాష్ట్రలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం పైన రౌత్ స్పందించారు. ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానట్టుగా తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన్ను డిస్టర్బ్ చేస్తామంటూ మొదటి రోజు నుంచి వాళ్లు చెబుతున్నారు. కానీ తాము అలా చేయమని, ప్రభుత్వానికి భంగం కలిగించమని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలని రౌత్ కోరారు.