ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నిపథ్ పథకం కింది అగ్నివీర్ వాయు ఇంటెక్ 01/2025 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో  సేవ చేయాలనుకునే అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 3,500. 

అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. 1. కంప్యూటర్ రాత పరీక్ష ( CBT), 2. ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ( PFT) , 3. ఎడాప్టబిలిటీ టెస్ట్ 1, 2, మెడికల్ టెస్ట్ ఉంటుంది. 

అగ్ని వీర్ 2024 కోసం దరఖాస్తులు ఎలా చేయాలి 

  • అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in ని సందర్శించాలి
  • హోం ఫేజిలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ దరఖాస్తు ఫారమ్ పై క్లిక చేయాలి 
  • అంతకంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత దరఖాస్తును పూర్తి చేయాలి 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి, దరఖాస్తు  ఫీజు చెల్లించాలి 
  • భవిష్యత్ అవసరాలకోసం అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్ తీసుకోవాలి

రిజిస్ట్రేషన్ ఫీజు : రూ. 550(ఆన్ లైన్ లో ) 

అర్హతలు: ఇంటర్మీడియట్ /10+2/ఫిజిక్స్, మ్యాథ్య్, ఇంగ్లీషుతో సమానమైన పరీక్ష లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణత లేదా రెండేళ్ల వోకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత(ఫిజిక్స్ , మ్యాథ్స్య్ తో ) 

సైన్స్ సబ్జెక్టులు కాకుండా: ఏదేని సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/10+2/ తత్సమానమైన ఎగ్జామ్ ఉత్తీర్ణత లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత. 

వయోపరిమితి : 2004 జనవరి 02 నుంచి 2007 జూలై02 మధ్య పుట్టినవారు అభ్యర్థులు అర్హులు. 

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష(CBT) ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ , అడాప్టబిలిటీ టెస్ట్ 1,2, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 
జీతం: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీర్ కు నెలకు రూ. 30,000 జీతం ఉంటుంది. దీంతో వార్షిక ఇంక్రిమెంట్ ప్యాకేజ్ ఉంటుంది.