ప్రజావాణి స్టేట్ నోడల్​ అధికారిగా ఐఏఎస్​ దాసరి హరిచందన

ప్రజావాణి స్టేట్ నోడల్​ అధికారిగా ఐఏఎస్​ దాసరి హరిచందన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్​ అధికారులను బదిలీ చేసింది. ఆయుష్​ డైరెక్టర్​ దాసరి హరిచందనను మున్సిపల్​ అడ్మినిస్ర్టేషన్ డైరెక్టర్​గా నియమించింది. దీంతో పాటు ప్రజావాణికి స్టేట్​ నోడల్​ ఆఫీసర్ గా కూడా నియమిస్తూ సీఎస్​శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్​ ఎంటర్​ప్రైజెస్​ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్​ కె. నిర్మలను జీఏడీలో సర్వీసెస్, జీపీఎం, ఏఆర్​టీలో నియమించారు

ఇయ్యాల ప్రజావాణిలో పాల్గొననున్న పొన్నం

బేగంపేటలోని ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించనున్న  ప్రజావాణి కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా భవన్ లో ప్రజా వాణి కార్యక్రమం జరగనుంది.