ఫోన్ల వల్ల.. చదువుపై ఫోకస్ చేయలేకపోతున్నారా..? ఐఏఎస్ దివ్య మిట్టల్ చెప్పే చిట్కాలు పాటించండి

ఫోన్ల వల్ల.. చదువుపై ఫోకస్ చేయలేకపోతున్నారా..? ఐఏఎస్ దివ్య మిట్టల్ చెప్పే చిట్కాలు పాటించండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)లో ప్రవేశం పొంది.. దేశంలోనే అత్యంత కఠినమైన రేటింగ్ పరీక్షలను ఛేదించిన ఐఏఎస్ దివ్య మిట్టల్ చదువుపై ఏకాగ్రతకు సహాయపడే, అడ్డంకులను ఎదుర్కొనేందుకు కొన్ని చిట్కాలు, ట్రిక్స్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం మిర్జాపూర్‌లో డీఎమ్‌గా పనిచేస్తున్న మిట్టల్, అందరిలాగే తాను కూడా చదువుకుంటున్న సమయంలో పరధ్యానంలో ఉండేదాన్నని.. కానీ ఆ తర్వాత మాత్రం తనకు తాను విధించుకున్న నియమాలు, పాటించిన చిట్కాలు వాటన్నింటినీ అధిగమించి ఏకాగ్రతను పెంపొందించాయని చెప్పారు.

మొబైల్ వాడకాన్ని తగ్గించాలి

ఏకాగ్రత కుదరాలంటే ముందుగా చేయాల్సిన పని మొబైల్ వాడకాన్ని తగ్గించడం. ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే యాప్ లేవో గుర్తించి వాటిని డిలీట్ చేయడం. ఎందుకంటే వీటి వల్ల మనకు తెలియకుండానే ఎంత సమయం వృథా చేస్తున్నామో కూడా తెలియదు అని మిట్టల్ చెప్పారు. అంతకంటే ముందు చేయాల్సిన మరో పని ఏంటంటే కొంత కాలం పాటు ఇంటర్నెట్‌ను బ్లాక్ చేయడం. దీని వల్ల మనకు తెలియకుండానే ఫోన్ ను పక్కన పెట్టేస్తామని ఆమె చెబుతున్నారు.

అలారం సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి

ఉదయాన్నే చదువుపై దృష్టి సారించాలని చెప్తూనే.. దాని ప్రాముఖ్యతను కూడా మిట్టల్ నొక్కి చెప్పారు. సాధారణంగా పొద్దున్నే లేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. అందులో భాగంగా అలారంను బిగ్గరగా వినిపించేలా(ధ్వనించేలా) పెట్టుకోవాలని మిట్టల్ సూచిస్తున్నారు. దాని వల్ల వెంటనే లేవగలుగుతారని, నిద్రకు ఆటంకం కలుగుతుందని, అదే సమయంలో చదువుకోవాలన్న ఆలోచనను కూడా గుర్తు చేస్తుందని కూడా ఆమె అంటున్నారు.

విరామానికి సెషన్స్

చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో విరామం కూడా తీసుకోవాలని.. అందుకు కొన్ని సెషన్‌లను సూచిస్తున్నారు మిట్టల్. ప్రతి 2 గంటల 90 నిమిషాలలను ఒక సెషన్ గా భావించి ఆ తర్వాత 15 నిమిషాల విరామం తీసుకోవాలని చెప్పారు. అలా చేయకపోతే స్టడీస్ పై రోజంతా లేదా ఎక్కువసేపు ఫోకస్‌ చేయలేమని కూడా ఆమె తెలిపారు.

ఏకాగ్రత కోసం..

దృష్టిని కేంద్రీకరించడానికి ఏదైనా వస్తువు, కొవ్వొత్తి జ్వాల, పెన్సిల్ లేదా గోడపై ఏదైనా ఒక వస్తువు.. వంటి వాటిని కాసేపు అలాగే చూడాలని, దాని వల్ల ఏకాగ్రతను పొందవచ్చని మిట్టల్ చెప్పారు. ఇది చదువుపై ఫోకస్‌ని పెంచుతుందని, ఫోకస్డ్ స్టేట్‌లోకి రావడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుందని తెలిపారు.

ఆరోగ్యంపై శ్రద్ధ

మంచి ఆరోగ్యం ప్రాముఖ్యతను గురించి ప్రస్తావించిన మిట్టల్.. ఆరుబయట వ్యాయామం చేయాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. “బయట వ్యాయామం చేయడం మంచిది. కనీసం 20 నిమిషాల నడక లేదా ప్రకృతికి దగ్గరగా ఉండండి. పార్క్‌కి వెళ్లి నడవండి/కూర్చండి. 5-10 నిమిషాలు అయినా కాస్త సూర్యకాంతిలో ఉండండి” అని మిట్టల్ చెప్పారు.

I have cleared some of the toughest entrance tests in the country like that for IIT, IIM, IAS. It is not that I was not distracted during studies, but I overcame those distractions.

Small tips on how to overcome distractions and get great focus

A thread?

— Divya Mittal (@divyamittal_IAS) July 21, 2023