
వామ్మో ఉద్యోగమంటేనే భయమేస్తోంది. ఉంటదో ఊడ్తదో తెలియని ఉద్యోగంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ తర్వాత ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందనే చెప్పవచ్చు.. వేలాది మందిని టెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. గూగుల్ అమెజాన్ ఇలా చెప్పుకుంటే పోతే దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించాయి.
లేటెస్ట్ గా ప్రముఖ ఐబీఎం తమ ఉద్యోగులను తొలగించడానికి కొత్త పద్ధతిని ఎంచుకుంది. ఐబీఎం ఉద్యోగులను ఇష్టానుసారంగా తీసేయకుండా స్వచ్ఛంధంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు ప్రోత్సహిస్తోంది. ఎవరైనా ఉద్యోగాల నుంచి తప్పుకోవాలనుకునే వాళ్లు చేతులు పైకెత్తాలని సూచించింది.
IBM ఫిబ్రవరిలో Q4 రిజల్ట్ సమయంలో కంపెనీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఆర్థికపరమైనదిగా కాకుండా సమతుల్యతగా చూడాలని తెలిపింది. 2024 చివరి నాటికి 3 బిలియన్ల వార్షిక సేవింగ్ కంపెనీ లక్ష్యమని కంపెనీ సీఎఫ్ఓ జేమ్స్ కవనాగ్ తెలిపారు. ఈ లేఆఫ్స్ లో 80 శాతం ఎంటర్‌ప్రైజ్ ఆపరేషన్స్ & సపోర్ట్ (EO&S), Q2C మిషన్‌లతో పాటు ఫైనాన్స్ ఆపరేషన్ విభాగాల్లో ఉండొచ్చని తెలిపింది.
ALSO READ :- ఏది నిజం : రుషికొండపై ఉన్నది జగన్ ప్యాలెసా.. ప్రభుత్వ భవనమా..!
దాదాపు 50 శాతం తగ్గింపు లక్ష్యంతో యూరప్ అంతటా పలు స్థాయిలో సిబ్బందిని ఐబీఎం ప్రభావితం చేయనుంది. లే ఆఫ్స్ లో ముందుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారిని పరిగణలోకి తీసుకోవాలని ఐబీఎం వెల్లడించింది.