విద్యార్థులకు గుడ్ న్యూస్.. 50లక్షల మందికి ఏఐలో శిక్షణ

విద్యార్థులకు గుడ్ న్యూస్.. 50లక్షల మందికి ఏఐలో శిక్షణ
  • ప్రకటించిన ఐబీఎం

న్యూఢిల్లీ: అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం 2030 నాటికి భారతదేశంలో 50 లక్షల మంది విద్యార్థులు,  పెద్దవాళ్లకు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్‌‌‌‌ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. 

ఐబీఎం స్కిల్స్‌‌‌‌బిల్డ్ ప్రోగ్రామ్‌‌‌‌ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తామని తెలిపింది.  ఐబీఎం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)తో కలిసి పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా సంస్థల్లో ఏఐ లెర్నింగ్ పాథ్‌‌‌‌వేలు, ఫ్యాకల్టీ శిక్షణ, హ్యాకథాన్‌‌‌‌లు, ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌లు నిర్వహించనుంది. 

కంపెనీ  సీఈఓ అర్వింద్ కృష్ణ మాట్లాడుతూ, “ ఏఐ, క్వాంటమ్‌‌‌‌ రంగాల్లో ప్రపంచాన్ని నడిపే కెపాసిటీ ఇండియాకు ఉంది.  మోడర్న్ స్కిల్స్‌‌‌‌ను  అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువత ఆవిష్కరణలు  పెరుగుతాయి. 

ఫలితంగా దేశం వృద్ధి చెందుతుంది”అని అన్నారు.  కాగా, ఐబీఎం గ్లోబల్‌‌‌‌గా మూడు కోట్ల మందికి ఏఐ, సైబర్ సెక్యూరిటీస్ వంటి టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఇండియాలో 50 లక్షల మందికి శిక్షణ ఇవ్వనుంది.