8106 పోస్టులకు ఐబీపీఎస్‌‌‌‌ నోటిఫికేషన్

 8106 పోస్టులకు ఐబీపీఎస్‌‌‌‌ నోటిఫికేషన్

ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌‌‌‌ర్సన‌‌‌‌ల్ సెల‌‌‌‌క్షన్‌‌‌‌(ఐబీపీఎస్‌‌‌‌) రీజినల్‌‌‌‌ రూరల్‌‌‌‌ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌‌‌‌బీ) కామ‌‌‌‌న్ రిక్రూట్‌‌‌‌మెంట్ ప్రాసెస్‌‌‌‌-XI (సీఆర్‌‌‌‌పీ)ద్వారా ఆఫీసర్స్​, ఆఫీస్ అసిస్టెంట్(మ‌‌‌‌ల్టీప‌‌‌‌ర్పస్‌‌‌‌) పోస్టుల భ‌‌‌‌ర్తీకి నోటిఫికేష‌‌‌‌న్ రిలీజ్​ చేసింది.

ఖాళీలు: మొత్తం 8106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ (మ‌‌‌‌ల్టీప‌‌‌‌ర్పస్‌‌‌‌) 4483, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-1 – 2676, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-2 (అగ్రిక‌‌‌‌ల్చర్ ఆఫీసర్‌‌‌‌) – 12, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-2 (మార్కెటింగ్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌) – 6, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-2 (ట్రెజ‌‌‌‌రీ మేనేజ‌‌‌‌ర్‌‌‌‌) – 10, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-2 (లా)–18, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-2 (సీఏ)– 19,  ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-2 (ఐటీ)– 57, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-2 (జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌)– 745, ఆఫీస‌‌‌‌ర్ స్కేల్‌‌‌‌-3– 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హత‌‌‌‌: పోస్టును బట్టి సంబంధిత స‌‌‌‌బ్జెక్టుల్లో బ్యాచిల‌‌‌‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌‌‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు సంబంధిత పనిలో అనుభ‌‌‌‌వం ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌‌‌‌లైన్ టెస్ట్‌‌‌‌(ప్రిలిమిన‌‌‌‌రీ, మెయిన్ ఎగ్జామ్‌‌‌‌), సూచించిన పోస్టుల‌‌‌‌కు ఇంట‌‌‌‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్తులు ఆన్‌‌‌‌లైన్ ద్వారా ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకోవాలి. జూన్​ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ ఆగ‌‌‌‌స్టులో నిర్వహించనున్నారు. మెయిన్స్​ సెప్టెంబ‌‌‌‌రు/ అక్టోబ‌‌‌‌ర్​లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం www.ibps.in వెబ్​సైట్​ సంప్రదించవచ్చు. 

మెయిన్స్ ఎగ్జామ్

ఐబీపీఎస్ క్లర్క్, ఆఫీసర్స్ స్కేల్–1 మెయిన్స్ ఎగ్జామ్200 మార్కులకు ఉంటుంది. రెండింటిలోనూ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవే ర్నెస్, హిందీ/ ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ సిలబస్ ఉంటుంది. క్లర్క్ న్యూమరికల్ ఎబిలిటీ, ఆఫీసర్స్​  స్కేల్​ –1కు క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి.  

ఐబీపీఎస్ ఆర్ఆర్​బీ ఎగ్జామ్ 2022
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నియామకాలు చేపడుతారు. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి  ఇంటర్వ్యూ ఉండదు.  ఆఫీసర్ స్కేల్–1, 2, 3కు అప్లై చేసుకొనేవారికి మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయి.