రిస్క్ లేనప్పుడే రీస్టార్ట్​ చేయాలి

రిస్క్ లేనప్పుడే రీస్టార్ట్​ చేయాలి

దుబాయ్:  ఇంగ్లండ్‌‌ బౌలర్లు  ఔట్‌‌డోర్ ట్రెయినింగ్‌‌ స్టార్ట్‌‌ చేశారు. మరికొన్ని రోజుల్లో ఆ దేశ బ్యాట్స్‌‌మెన్‌‌, వికెట్ల కీపర్లు కూడా గ్రౌండ్‌‌లోకి రాబోతున్నారు. మరో వైపు ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ను పట్టాలెక్కించేందుకు ఐసీసీ రంగంలోకి దిగింది. తిరిగి ఆట మొదలెట్టేందుకు పాటించాల్సిన గైడ్‌‌లైన్స్‌‌ను రిలీజ్‌‌ చేసింది. దాంతో, తొందర్లోనే  మళ్లీ క్రికెట్‌‌ యాక్షన్‌‌ను చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, చాలా దేశాల్లో  కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో  క్రికెట్‌‌ యాక్టివిటీని తిరిగి ప్రారంభించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని  సభ్య దేశాల బోర్డులకు ఐసీసీ సూచించింది. తమ గైడ్‌‌లైన్స్‌‌లో భద్రతకే ప్రాధాన్యత ఇచ్చిన ఐసీసీ.. అన్ని స్టేజ్‌‌ల్లో ఆయా ప్రభుత్వాల నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పింది. వైరస్‌‌ రిస్క్‌‌ లేనప్పుడు, లోకల్‌‌ ట్రాన్స్‌‌మిషన్‌‌ పూర్తిగా కంట్రోల్‌‌లోకి వచ్చినప్పుడే క్రికెటింగ్ యాక్టివిటీని స్టార్ట్‌‌ చేయాలని స్పష్టం చేసింది. అలాగే, ఎలాంటి యాక్టివిటీ మొదలుపెట్టే ముందైనా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ట్రెయినింగ్‌‌ సెషన్‌‌ లేదా మ్యాచ్‌‌ ప్రారంభించేముందు మైదానం, ట్రెయినింగ్‌‌ వెన్యూ, ఛేంజింగ్‌‌ రూమ్స్‌‌, ఎక్విప్‌‌మెంట్‌‌, బాల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ తదితర విషయాల్లో ఎలాంటి రిస్క్‌‌ లేకుండా చూసుకోవాలని చెప్పింది. అదే సమయంలో  స్పోర్టింగ్‌‌ యాక్టివిటీల నిర్వహణకు ప్రభుత్వాల అనుమతి లేని చోట ఎట్టి పరిస్థితుల్లోనూ క్రికెట్‌‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరపొద్దని తేల్చి చెప్పింది. గవర్నమెంట్‌‌ క్లియరెన్స్‌‌ ఉంటేనే  శిక్షణ, ఆట మొదలు పెట్టాలని చెప్పింది. సేఫ్టీ విషయంలో ప్లేయర్లను ఎడ్యుకేట్‌‌ చేయాలని సూచించింది.

టెస్టులకు రెడీ అయ్యేందుకు బౌలర్లకు 2-3 నెలల టైమ్‌

కరోనా కారణంగా  దాదాపు రెండు నెలల నుంచి  ఆటకు, ప్రాక్టీస్‌‌కు దూరంగా ఉన్న బౌలర్లు.. తిరిగి టెస్టు క్రికెట్‌‌కు రెడీ  అయ్యేందుకు ఇతరుల కంటే ఎక్కువ సమయం అవసరం అని ఐసీసీ చెప్పింది. గాయాలు కాకుండా మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించేందుకు వాళ్లకు రెండు నుంచి మూడు నెలల ప్రిపరేషన్‌‌ టైమ్‌‌ సెట్‌‌ చేసింది. ‘టెస్టు క్రికెట్‌‌కు రెడీ అయ్యేందుకు బౌలర్లకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం అవసరం. చివరి 4–5 వారాల్లో వాళ్లు మ్యాచ్‌‌ ఇంటెన్సిటీ బౌలింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేయాలి. ఇంత పెద్ద బ్రేక్‌‌ తర్వాత  తిరిగి గ్రౌండ్‌‌లోకి వచ్చినప్పుడు ప్రధానంగా  బౌలర్లు గాయాల బారినపడే ప్రమాదం ఉంది. పరిమిత ప్రిపరేషన్స్‌‌ కారణంగా కూడా రిస్క్‌‌ ఎక్కువ అవుతుంది. ఎప్పట్లోపు మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తారనేది  వాళ్ల ఏజ్‌‌, ఫిజికల్‌‌ ప్రిపేర్డ్‌‌నెస్‌‌ (శారీరక సంసిద్ధత)పై ఆధారపడి ఉంటుంది. వాళ్లు సేఫ్‌‌గా, ఎఫెక్టివ్‌‌గా ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లోకి రిటర్న్‌‌ అవుతారనేదానిపై ఆ అంశాలు ప్రభావం చూపుతాయి’ అని ఐసీసీ చెప్పింది.  వన్డేలకు ప్రిపేర్‌‌ అయ్యేందుకు ఆరు వారాల సమయం అవసరం అని, అందులో చివరి మూడు వారాలు మ్యాచ్‌‌ ఇంటెన్సిటీ బౌలింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. టీ 20లకు మాత్రం బౌలర్లు త్వరగానే రెడీ అయ్యే చాన్స్ ఉందని, ఇందుకు ఐదారు వారాలు సరిపోతుందని  చెప్పింది. బౌలర్ల వర్క్‌‌లోడ్‌‌పై జాగ్రత్త వహించాలని జట్లకు ఐసీసీ సూచించింది.

వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ బెస్ట్