పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డుకు చుక్కెదురు.. మ్యాచ్ రిఫరీని తొలగించేందుకు ఒప్పుకోని ఐసీసీ

పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డుకు చుక్కెదురు.. మ్యాచ్ రిఫరీని తొలగించేందుకు ఒప్పుకోని ఐసీసీ
  • షేక్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండ్ వివాదంపై పీసీబీ ఫిర్యాదు తిరస్కరణ

దుబాయ్: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గ్రౌండ్ బయటా చుక్కెదురైంది.  ఇండియాతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీవ్ర దుమారం రేపిన హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఫిర్యాదును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తోసిపుచ్చింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించాలన్న పీసీబీ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐసీసీ తిరస్కరించింది. పైక్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టోర్నీ నుంచి తప్పించడం లేదని పీసీబీకి సోమవారం రాత్రే అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు ఐసీసీ వర్గాలు తెలిపాయి.  ఈ వివాదంపై ఐసీసీకి  పీసీబీ చేసిన ఫిర్యాదులో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్   పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ,  ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేతులు కలపకుండా అడ్డుకున్నారని ఆరోపించింది.

పైక్రాఫ్ట్ కారణంగా కెప్టెన్లు టీమ్ షీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఛేంజ్ చేసుకోలేదని పాక్ టీమ్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీసీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఐసీసీ 69 ఏండ్ల జింబాబ్వే అధికారి  పైక్రాఫ్ట్ ప్రవర్తనలో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది. నిజానికి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  హ్యాండ్ షేక్ చేయవద్దనే నిర్ణయం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారుల నుంచి వచ్చిందని, దాన్ని మాత్రమే పైక్రాఫ్ట్ కెప్టెన్లకు చేరవేశారని వెల్లడించింది. ఈ వ్యవహారంపై పీసీబీ తమ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఉస్మాన్ వల్హాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇండియా తీసుకున్న నో హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షేక్ పాలసీ గురించి వల్హా తమ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దీనికి బాధ్యుడిగా వల్హాను పదవి నుంచి తొలగించాలని పీసీబీ చీఫ్ మోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిన్ నఖ్వీ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మ్యాచ్ రిఫరీని తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని పీసీబీ హెచ్చరించింది. ఆ పని చేస్తే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశంతో పాటు భారీ రెవెన్యూ కోల్పోయే ప్రమాదం ఉండటంతో  పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ నుంచి తప్పుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించడం లేదు. ఇక  బుధవారం యూఏఈతో జరిగే మ్యాచ్​కు కూడా పైక్రాఫ్ట్  రిఫరీగా వ్యవహరించాల్సి ఉంది. అయితే, పీసీబీ పైక్రాఫ్ట్ స్థానంలో రిచీ రిచర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించాలని ఐసీసీని కోరినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.