ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో

ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో
  • ఇండియాపై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీపై ఐసీసీ వీడియో వైరల్
  • లాస్ట్ ఓవర్ డ్రామాపై వీడియో: రన్ ఔట్.. క్యాచ్ ఔట్.. నో బాల్..విక్టరీ

క్రైస్ట్‌‌‌‌చర్చ్‌‌: ఐసీసీ ఉమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌కప్‌‌లో ఇండియాకు ఊహించని షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ తో అదరగొట్టిన తీరు చూస్తే అంతా ఈ మ్యాచ్  ఇండియా భారీ విజయం సాధిస్తుందనుకున్నారు. మూడు హాఫ్ సెంచరీలు.. భారీ టార్గెట్ తో భారత మహిళలు సూపర్ అనిపించారు. స్మృతి మంధానా (71), మిథాలీ రాజ్‌‌ (68), షెఫాలీ వర్మ (53), హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (48) బ్యాటింగ్‌‌లో రాణించడంతో.. టాస్‌‌ గెలిచిన ఇండియా 50 ఓవర్లలో 274/7 స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌లో సఫారీ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. స్మృతి, షెఫాలీ ఫస్ట్‌‌ వికెట్‌‌కు 91 రన్స్‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. యాస్తికా భాటియా (2) విఫలమైనా, మిడిలార్డర్‌‌లో మిథాలీ రెండు కీలక భాగస్వామ్యాలతో ఆకట్టుకుంది. స్మృతితో కలిసి మూడో వికెట్‌‌కు 80, హర్మన్‌‌తో నాలుగో వికెట్‌‌కు 58 రన్స్‌‌ జోడించింది. కానీ ..బిగ్ టార్గెట్ ను కాపాడుకోలేక పోయిన ఇండియా.. అస్థిరమైన పెర్ఫామెన్స్‌‌తో నిరాశపరిచింది. చావో రేవో మ్యాచ్‌‌లో చేతులెత్తేసింది. సెమీస్‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో 3 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.

అయితే లాస్ట్ ఓవర్ లో జరిగిన డ్రామాపై ఐసీసీ సోమవారం ఓ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. సౌతాఫ్రికా గెలవాలంటే ఆఖరి ఓవర్‌‌లో 7 రన్స్‌‌ కావాలి. మొదటి బాల్ కి 1 రన్ , రెండో బాల్ కి 1 రన్ తీయగా రెండో పరుగు తీస్తుండగా త్రిషా చెట్టి (7) రన్ ఔట్. 3, 4  బాల్స్ కి సింగిల్స్ మాత్రమే రాగా 5 బాల్ కి  డుప్రిజ్‌ క్యాచ్ ఔట్ అవుతుంది. ఇక అంతే సంగతులు స్టేడియం దద్దరిల్లింది. ఒక్క బాల్ కి 3 రన్స్ కావాలి. కీలక బ్యాటర్ ఔట్ అయ్యింది. అంతా ఇండియా విజయం కన్ఫమ్ అనుకున్నారు. భారత ప్లేయర్లైతే ఆనందానికి అవదులులేకుండా స్టేడియంలో గంతులేశారు. కానీ ఆ సంతోష క్షణాలు సెకన్లపాటే ముగిశాయి. అంపైర్ అది నో బాల్ గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా భారత ప్లేయర్ల హార్ట్ బ్రేక్ అయ్యింది. సపారీలకైతే ఊహించని లక్ కలిసిరావడంతో మరోసారి స్టేడియం కేకలతో దద్దరిల్లింది. 1 బాల్ మూడు రన్స్ కావాల్సి ఉండగా.. సౌతాఫ్రికా విజయ సమీకరణం రెండు బాల్స్‌‌లో రెండు రన్స్‌‌గా మారింది. ఈ ఈక్వేషన్‌‌ను డుప్రిజ్‌‌, ఇస్మాయిల్‌‌(2 నాటౌట్‌‌) ఈజీగా ఛేదించారు. డు ప్రిజ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.   చివరి 10 ఓవర్ల నుంచి బాల్ టు బాల్  ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ఇలా చివరి బాల్ వరకు నువ్వా నేనా అనేలా సాగింది. ఆ క్షణాల్లో రెండు దేశాల ఫ్యాన్స్ ఎక్స్ ప్రెషన్స్, కామెంటర్స్ తీరు, స్టాండింగ్ లో టెన్షన్ ఇదంగా వీడియో రూపంలో పోస్ట్ చేసింది ఐసీసీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ..భారత్ కొంప ముంచిన నో బాల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

డ్రామా ఓవర్..బాల్స్ రన్స్.. రన్ ఓట్.. నో బాల్..చివరి బాల్ కి విక్టరీ

మొదటి బాల్-(1)
రెండో బాల్-(1) రన్ ఔట్
మూడో బాల్-(1)
నాలుగో బాల్-1
ఐదో బాల్- (1) క్యాచ్ ఔట్.. (నో బాల్) ఫ్రీ హిట్
ఐదో బాల్-1
ఆరో బాల్-1-సౌతాఫ్రికా విక్టరీ


 

ఇండియా.. ఇంటికే

 

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో