ఐసీసీ విమెన్స్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మంధాన మళ్లీ నంబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఐసీసీ విమెన్స్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మంధాన మళ్లీ నంబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దుబాయ్: ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ విమెన్స్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ నంబర్ వన్​ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె రెండు నుంచి టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. ఆదివారం ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన తొలి  పోరులో ఫిఫ్టీ కొట్టడంతో 7 రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లు సాధించిన మంధాన మొత్తం 735 పాయింట్లతో అగ్రస్థానం అందుకుంది.  ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ సివర్ -బ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (731 పాయింట్లు) రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది.

మంధాన తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2019లో తొలిసారి టాప్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకుంది.  ఈ ఏడాది టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడం రెండోసారి కావడం విశేషం.  ప్రతీకా రావల్ 4 స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకోగా, హర్లీన్ డియోల్ 43వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా పేసర్ కిమ్ గార్త్, స్పిన్నర్ అలానా కింగ్ వరుసగా 4,5 స్థానాలతో తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్టు ర్యాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్నారు. ఇండియా స్పిన్నర్ స్నేహ రాణా 13వ స్థానానికి చేరుకుంది.