
సిడ్నీ : ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. సిడ్నీ వేదికగా భారత్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అన్ని అస్త్రాలతో రెడీ అయ్యింది పాత చరిత్రను పక్కనబెట్టి.. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చే విజయాలను సాధించాలన్న ఏకైక టార్గెట్‌తో శుక్రవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవాలనే కసిగా ఉంది టీమిండియా.
సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్‌లో తమదైన విజయాలు సాధించినా.. ఇప్పటివరకు వరల్డ్ కప్ మాత్రం ఇండియాకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. వ్యక్తిగత రికార్డులు సృష్టించిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలాంటి టాప్ ప్లేయర్లు కూడా ఓ దశలో కప్ కోసం పోరాడి వెనక్కి తగ్గారు. అయితే ఈసారి యంగ్ లేడీస్‌తో బరిలోకి దిగుతున్న టీమిండియా భారీ విజయాలపై కన్నేసింది. తొలి అడుగులోనే బలమైన కంగారూలకు చెక్ పెడితే టోర్నీ మొత్తం ఆత్మవిశ్వాసంతో ఆడొచ్చని అంచనాలు వేసుకుంటున్నారు.
టీమ్స్ వివరాలు
IND XI: Shafali Verma, Smriti Mandhana, Jemimah Rodrigues, Harmanpreet Kaur (c), Deepti Sharma, Veda Krishnamurthy, Shikha Pandey, Taniya Bhatia (wk), Arundhati Reddy, Radha Yadav, Rajeshwari Gayakwad #T20WorldCup
— cricket.com.au (@cricketcomau) February 21, 2020
AUS XI: Alyssa Healy (wk), Beth Mooney, Ashleigh Gardner, Meg Lanning (c), Ellyse Perry, Rachael Haynes, Annabel Sutherland, Jess Jonassen, Delissa Kimmince, Molly Strano, Megan Schutt#T20WorldCup
— cricket.com.au (@cricketcomau) February 21, 2020