ICC World Cup 2023: వరల్డ్ కప్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు

ICC World Cup 2023: వరల్డ్ కప్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వ‌న్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పెద్ద వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్కాడు.  వ‌న్డే వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో రోహిత్ శర్మ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.  36 ఏళ్ల 161 రోజుల వ‌య‌సులో రోహిత్ శ‌ర్మ వరల్డ్ కప్లో భారత జట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్నాడు.

ALSO READ : Cricket World Cup 2023: ఆ ఒక్కడితోనే ప్రమాదం.. జాగ్రత్తగా ఆడితేనే టీమిండియాకు గెలుపు

తాజా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో ఈ రికార్డు అజారుద్దీన్ పేరు మీద ఉండేది. అజారుద్దీన్ 36 ఏళ్ల 124 రోజుల వ‌య‌సులో టీమిండియాకు నాయకత్వం వహించాడు. రోహిత్‌ శర్మ, అజారుద్దీన్ త‌రువాత రాహుల్ డ్రవిడ్ 34 ఏళ్ల 71 రోజుల వయసులో వరల్డ్ కప్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత  ఎస్ వెంక‌ట‌రాఘ‌వ‌న్ 34 ఏళ్ల 56 రోజుల వయసులో భారత జట్టుకు వరల్డ్ కప్లో  సారథ్యం వహించాడు. ఎంఎస్ ధోని 33 సంవత్సరాల 262 రోజుల వయసులో టీమిండియాకు వరల్డ్ కప్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. 

వరల్డ్ కప్లో అత్యధిక వయసులో టీమిండియా కెప్టెన్లు వీరే

  • రోహిత్ శ‌ర్మ – 36 ఏళ్ల 161 రోజులు – 2023 వ‌న్డే వరల్డ్ కప్
  • మ‌హ్మద్ అజారుద్దీన్ – 36 ఏళ్ల 124 రోజులు – 1999 వ‌న్డే  వరల్డ్ కప్
  • రాహుల్ ద్రావిడ్ – 34 ఏళ్ల 71 రోజులు – 2007 వ‌న్డే వరల్డ్ కప్
  • ఎస్ వెంకటరాఘవన్ – 34 ఏళ్ల 56 రోజులు – 1979 వ‌న్డే వరల్డ్ కప్
  • ఎంఎస్ ధోని- – 33 ఏళ్ల  262 రోజులు– 2015 వన్డే వరల్డ్ కప్