ICC WTC 2027-29: రెండంచెల టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు.. టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో మొత్తం 12 జట్లు

ICC WTC 2027-29: రెండంచెల టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు.. టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో మొత్తం 12 జట్లు

టెస్ట్ క్రికెట్ స్థాయిని విస్తరించే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్టు సమాచారం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా తొలిసారి 12 జట్లను ఆడేందుకు ఏర్పాట్లు జరుపుతుంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 9 జట్లు ఆడుతున్నాయి. 2025-27 సైకిల్ లో ఎలాంటి మార్పులు ఉండవు. అనగా తొలి మూడు డబ్ల్యూటీసీలో ఆడిన 9 జట్లే ఆడనున్నాయి. 2027-29 WTC సైకిల్ లో జట్ల సంఖ్యను 9 నుండి 12కి పెంచుతారు. ప్రస్తుతం 9 జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడుతుండగా.. రానున్న డబ్ల్యూటీసీలో కొత్తగా ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే,  ఐర్లాండ్ జట్లను అదనంగా చేర్చనున్నారు. 

ఈ మూడు దేశాలు ఐసీసీ పూర్తి సభ్యులు అయినప్పటికీ ఇప్పటివరకు ఈ జట్లను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో చేర్చలేదు. ఈ విషయంపై ఐసీసీ ఇటీవల దుబాయ్‌లో సమావేశమైంది. ESPNcricinfo నివేదిక ప్రకారం రెండంచెల టెస్ట్ ఫార్మాట్ (టు టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆలోచనను రద్దు చేయనుంది. "ప్రతి ఒక్కరూ టెస్ట్ క్రికెట్ ఆడే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఫార్మాట్ కొత్తగా ఆడేవారికి  అవకాశాలు కల్పిస్తాం. ఇతర జట్లు టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆడడానికి ప్రోత్సహిస్తాం". అని బోర్డు డైరెక్టర్ ఒకరు ESPNcricinfo కి చెప్పారు. కొత్త జట్లు అదే టెస్టుల విషయంలో ఐసీసీ త్వరలో క్లారిటీ ఇవ్వనుంది. 

►ALSO READ | BAN vs IRE: బంగ్లాదేశ్ నుంచి ఇది ఊహించనిది.. ఐర్లాండ్‌పై 338 పరుగులకు ఒకటే వికెట్

ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్,  జింబాబ్వేలు 2027-29 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ముందుగా, ఈ 12 జట్లను రెండు విభాగాలుగా విభజించాలని ప్రణాళికలు ఉన్నాయి. అయితే రెండవ డివిజన్‌లో భాగం కావాలని భావించిన వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలు పెద్ద దేశాలతో ఆడలేమేమో అనే భయంతో ఈ ఆలోచనను వ్యతిరేకించాయి. త్వరలో ఐసీసీ ఈ ఆలోచనను ఖరారు చేయనుందని సమాచారం.