
న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చిన స్పెషల్ స్కీమ్ ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ ను మరో ఆరు నెలల పాటు పొడిగించామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ కింద ఐదేళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల కాల పరిమితి వరకు గల ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లు 7.5 శాతం వడ్డీని పొందొచ్చు.
రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లు ఎఫ్‌డీలపై అదనంగా 0.10 % – 0.50 % వరకు వడ్డీని పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఈ స్కీమ్ పీరియడ్‌లో ఓపెన్ చేసిన కొత్త, రెన్యూ చేసుకున్న రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ ఆఫర్ వరిస్తుంది. ప్రీమెచ్యూర్ విత్‌డ్రాలపై ఒక శాతం పెనాల్టీ పడుతుంది.