రూ.50 వేలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్.. మినిమం బ్యాలెన్స్ భారీగా పెంచిన ఐసీఐసీఐ

రూ.50 వేలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్..  మినిమం బ్యాలెన్స్ భారీగా పెంచిన ఐసీఐసీఐ

న్యూడిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పొదుపు ఖాతాల్లో మినిమమ్​బ్యాలెన్స్ మొత్తాన్ని (ఎంబీఏ) 5 రెట్లు పెంచి రూ.50 వేలకు చేర్చింది. గతంలో ఇది రూ.10 వేలు ఉండేది. ఈ నెల ఒకటో తేదీ తర్వాత తెరిచిన కొత్త పొదుపు బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.50 వేలు ఉండాలి. సెమీ-అర్బన్ ప్రాంతాలు,  గ్రామీణ ప్రాంతాలకు ఎంఏబీ వరుసగా రూ.25 వేలకు,  రూ.10 వేలకు పెంచింది. ఎంఏబీ చెల్లించకపోతే, ఎంఏబీ లోటులో 6 శాతం లేదా రూ. 500..ఏది తక్కువైతే అది కట్టాలి. 

సేవింగ్స్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌‌‌‌పై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ వస్తుంది.  ఈ నెల ఒకటో తేదీకి ముందు ఖాతాలు తెరిచిన కస్టమర్లు ప్రస్తుతానికి పాత ఎంఏబీ స్థాయిని కొనసాగించాలి. జీతం ఖాతాదారులు, పీఎం జనధన్ ఖాతాదారులు,  బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు రూ.50 వేల లిమిట్​వర్తించదు. ఎస్​బీఐ,  పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్,  ఇండియన్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఎంబీఏపై జరిమానాలను తొలగించాయి.