జీరో సరెండర్ చార్జీలతో ఐసీఐసీఐ యాన్యుటీ ప్లాన్‌‌

జీరో సరెండర్ చార్జీలతో ఐసీఐసీఐ యాన్యుటీ ప్లాన్‌‌

హైదరాబాద్​, వెలుగు:  ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీని  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్  ప్రారంభించింది. పరిశ్రమలో జీరో సరెండర్ చార్జీల సదుపాయం కలిగిన మొట్టమొదటి యాన్యుటీ ప్లాన్ ఇది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఎప్పుడైనా ప్రీమియంలో 100 శాతం డబ్బును వాపసు పొందవచ్చు. యాన్యుటీ ప్రొడక్ట్ కస్టమర్‌‌లకు ‘ఎష్యూర్డ్​ ఇన్​కమ్​’ వస్తుంది.

తద్వారా ఆర్థికంగా,  స్వతంత్రంగా రిటైర్డ్ జీవితాన్ని గడపవచ్చు. ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్‌‌లో ప్రీమియం మినహాయింపుతో జాయింట్ లైఫ్‌‌ను ఎంచుకోవచ్చు. కస్టమర్ మరణిస్తే అన్ని భవిష్యత్ ప్రీమియంలను మాఫీ చేస్తారు.  సమ్​ ఎష్యూర్డ్​ మొత్తాన్ని సెకండ్  యాన్యుయిటెంట్  లేదా జాయింట్ హోల్డర్‌‌కు చెల్లిస్తారు.   జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు మొదలైన వారిలో ఎవరైనా సెకండ్  యాన్యుయిటెంట్ కావచ్చు.