వ్యాక్సిన్ తీసుకున్నా.. డెల్టా వేరియంట్ తో ముప్పు తప్పదు

వ్యాక్సిన్ తీసుకున్నా.. డెల్టా వేరియంట్ తో ముప్పు తప్పదు

చెన్నై: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న దేశాన్ని థర్డ్ వేవ్ ముప్పు భయపెడుతోంది. అయితే కొవిడ్ కేసుల తక్కువగా ఉండటంతో ఇప్పుడప్పుడే మూడో వేవ్ డేంజర్ లేదని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తూ గుబులు పుట్టిస్తున్న డెల్టా వేరియంట్ భారత్ ను కూడా భయపెడుతోంది. డెల్టా వేరియంట్ గురించి ఐసీఎంఆర్ సైంటిస్టులు చెప్పిన కొత్త విషయాలు ఆ భయాన్ని మరింతగా పెంచుతున్నాయి.

వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు తీసుకున్న వ్యక్తులకూ డెల్టా వేరియంట్ తో ముప్పేనని మద్రాస్ లోని ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. ఈ స్టడీకి సంబంధించిన విషయాలు జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లో ఈ వారం పబ్లిష్ అయ్యాయి. దీని ప్రకారం.. వాక్సిన్ తీసుకోని వారితోపాటు తీసుకున్న వారి మీద కూడా డెల్టా వేరియంట్ ఒకేలా ప్రవర్తిస్తోంది. వ్యాక్సిన్లకు ఈ వేరియంట్ లొంగట్లేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్నది డెల్టా వేరియంట్. దాని కంటే 60 శాతం ఎక్కువ శక్తిమంతంగా ఉన్న డెల్టా ప్లస్ వేరియంట్  ఇండియాలోనూ విజృంభిస్తుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేరియంట్ అంత ఈజీగా వ్యాక్సిన్‌కి లొంగట్లేదని నిపుణులు అంటున్నారు. ఇది రెండు డోసులు వేసుకున్న వారికి కూడా సులువుగానే సోకుతోంది.