
బాలీవుడ్ నిర్మాత పెళ్లిలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సందడి చేశాడు. ప్రముఖ నిర్మాత మధు వంతెనకు తన ప్రేయసితో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ముంబయిలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్లు, పలు సినీ ఇండస్ర్టీ ప్రముఖులు హాజరయ్యారు. వెడ్డింగ్ రిసెప్షన్ కి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కూడా వెళ్లి సందడి చేశారు. అంతకుముందే వచ్చిన హీరో అమీర్‌ఖాన్ కి బన్నీ షేక్హ్యాండ్ఇచ్చాడు.
ఈ ఈవెంట్‌కి హృతిక్ రోషన్, అనిల్‌కపూర్, జాకీ ష్రాఫ్తదితర ఫేమస్ నటీనటులు హాజరయ్యారు. బన్నీ, మిగతా బాలీవుడ్ స్టార్స్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.