ఫలితం అనుభవిస్తరు: ఐడీఎఫ్​

ఫలితం అనుభవిస్తరు: ఐడీఎఫ్​

టెల్ అవీవ్​ తోపాటు జెరూసలెంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇరాన్ మిసైల్స్ ను ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకుంటోందని చెప్పింది. కొన్ని మిసైళ్లు ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ దాడితో ఎలాంటి మరణాలు సంభవించలేదని, కొంతమంది పౌరులకు స్వల్ప గాయాలయ్యాయని ప్రకటించింది. డిఫెన్స్ తో పాటు అఫెన్స్ కూ ఇజ్రాయెల్​సంసిద్ధంగా ఉందని, ఈ దాడులకు ఇరాన్ ఫలితం అనుభవిస్తుందని ఐడీఎఫ్​ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ లో విమానాల రాకపోకలను ఎక్కడివక్కడే నిలిపివేశారు. ఎయిర్ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సాయంగా అమెరికా రంగంలోకి..

ఇరాన్ మిసైల్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ కు సాయంగా అమెరికా రంగంలోకి దిగింది. మిసైల్ డిఫెన్స్ వ్యవస్థకు సాయం అందించాలని తమ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్​ను ఉద్దేశిస్తూ  వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.