ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ లాభం అప్​

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ లాభం అప్​

న్యూఢిల్లీ: ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ 2023–-24 ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో రూ.751.3 కోట్ల నికర లాభాన్ని (స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో వచ్చిన లాభం రూ.556 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం పెరిగింది. తాజా క్వార్టర్​లో ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) రూ.3,950.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.3,002.2 కోట్లతో పోలిస్తే ఎన్​ఐఐ 31.6 శాతం పెరిగింది.  గ్రాస్​ఎన్​పీఏల విలువ రూ.3,747.8 కోట్ల నుంచి రూ.3,603.4 కోట్లకు తగ్గింది. 

ఏప్రిల్–-జూన్ కాలంలో గ్రాస్​ జీఎన్​పీ నిష్పత్తి రూ.2.17 శాతం నుంచి 2.11 శాతానికి మెరుగుపడింది.  తాజా క్వార్టర్​ ముగింపులో నికర ఎన్​పీఏల విలువ రూ.1,192.5 కోట్లకు చేరింది. ఇది మునుపటి క్వార్టర్​లో రూ.1,140 కోట్లుగా ఉంది.   కోర్ ఆపరేటింగ్ లాభం సెప్టెంబర్ 2023 క్వార్టర్​లో రూ.1,456 కోట్లకు చేరుకుంది. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే రూ.1,052 కోట్ల నుంచి 38 శాతం పెరిగింది.  

ప్రధాన నిర్వహణ ఆదాయం వార్షికంగా 35 శాతం పెరిగి రూ.5,326 కోట్లకు చేరుకుంది.  ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కస్టమర్ డిపాజిట్లు సంవత్సరానికి 44 శాతం పెరిగి రూ.1.65 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రెండవ క్వార్టర్​లో కరెంట్ ఖాతా పొదుపు ఖాతా (కాసా) డిపాజిట్లు సంవత్సరానికి 26 శాతం పెరిగి రూ.79,468 కోట్లకు చేరుకున్నాయి. కాసా నిష్పత్తి 46.4 శాతంగా ఉంది. రిటైల్ డిపాజిట్లు సంవత్సరానికి 50 శాతం పెరిగి రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయి.