కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో ఆధునీకరించిన ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌ ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కరీంనగర్ బల్దియాకు చెందిన కాంప్లెక్స్ భవనాన్ని సుడా నిధులు రూ.79 లక్షలతొ 48 షాపులను ఆధునీకరించారు.  కాంప్లెక్స్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ,  సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు ప్రారంభించారు. 

అనంతరం సుడా నిధులు రూ.1.28 కోట్లతో నిర్మించబోయే నైట్ ఫుడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అడిషనల్ కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు 
పాల్గొన్నారు.