
- కరోనా ఇలాగే ఉంటే ఆహార సంక్షోభమే
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మరి కారణంగా మరో పెనుసంక్షోభం తప్పదంట. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం మొదలవుతుందంట. ఈ ఎఫెక్ట్ తో రోజుకు కనీసం 3 లక్షల మంది చనిపోతారని వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ చీఫ్ డేవిడ్ బిస్లే హెచ్చరించారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం స్తంభించటం ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల మంది ఆకలి చావుల బారిన పడటం ఖాయమని చెప్పారు. ఇది కరోనాను మించిన విలయంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా పేద దేశాలు ఆర్థికంగా నష్టపోయాయని…కోట్లాది మంది ఆకలితో బాధపడుతున్నారని డేవిడ్ చెప్పారు. ఇటువంటి సమయంలో యూఎన్ కు ఇచ్చే నిధుల్లో డెవలప్డ్ కంట్రీస్ కోత పెట్టవద్దని మరింత ఎక్కువ సహాయం చేయాలని సూచించారు. అలా అయితేనే కొంతవరకు ఆకలి చావులను కంట్రోల్ చేయగలమని చెప్పారు. ఇప్పటికే చాలా దేశాల్లో లాక్ డౌన్ కారణంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ తగ్గిపోయింది. పనిలేక కోట్లాది కుటుంబాలు కడుపు నిండా భోజనం చేయటం లేదు. ఫుడ్ క్రైసెస్ సమస్య లేకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలని ఆయన కోరారు.