కరోనాను ఓడించాలంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే

V6 Velugu Posted on Apr 08, 2021

న్యూఢిల్లీ: కరోనాను తరిమికొట్టడంలో వాక్సినేషన్ కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఆయన రెండో డోస్ కరోనా టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో తాను టీకా వేయించుకున్నట్లు తెలిపారు. వైరస్ ను ఓడించడానికి ఉన్న పలు మార్గాల్లో టీకా తీసుకోవడం ఒకటన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులైన వారు వెంటనే టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా మీద జరుగుతున్న యుద్ధంలో గెలవాలంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 

Tagged pm modi, corona vaccine, amid corona virus scare

Latest Videos

Subscribe Now

More News