నేను అమెరికా అధ్యక్షుడినైతే..75% ఉద్యోగులను తీసేస్తా.. రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి

 నేను అమెరికా అధ్యక్షుడినైతే..75%  ఉద్యోగులను తీసేస్తా.. రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి

వాషింగ్టన్:​ 2024 ఎన్నికల్లో తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే 75 శాతం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తానని భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అన్నారు. అలాగే, ఎఫ్‌‌బీఐ వంటి పలు ప్రధాన ఏజెన్సీలను మూసేస్తానని చెప్పారు. 

ప్రస్తుత ప్రెసిడెంట్లు తోలుబొమ్మల మాదిరిగా వ్యవహరిస్తున్నారని రామస్వామి విమర్శించారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున ప్రెసిడెంట్​అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీపడుతున్నారు. 

తాజాగా ఆయన ఓ న్యూస్ వెబ్‌‌సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన కామెంట్లు చేశారు.  విద్యాశాఖ, బ్యూరో ఆఫ్‌‌ ఆల్కహాల్‌‌, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్, ఇంటర్నల్‌‌ రెవెన్యూ సర్వీసెస్, కామర్స్‌‌ డిపార్టుమెంట్స్‌‌ ను తొలగించడమే తన లక్ష్యమని చెప్పారు.