కాకా కర్మాగారాలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు అందులో ఉద్యోగాలు అమ్ముకున్నారు : మక్కన్ సింగ్

కాకా కర్మాగారాలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు అందులో ఉద్యోగాలు అమ్ముకున్నారు : మక్కన్ సింగ్

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడి మళ్ళీ మాయమాటలు చెప్పడానికి జనం ముందుకు వస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విమర్శించారు.  గత 10 ఏళ్లుగా మంత్రిగా ఉన్న కొప్పుల ఎప్పుడైనా కార్మిక సమస్యలపై మాట్లాడిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ఇసుక, బూడిద దందాలు చేసింది నిజం కాదా అని నిలదీశారు. కార్మికులను బెదిరింపులకు గురిచేస్తే సహించేది లేదని పైర్ అయ్యారు. 

రామగుండం ఎన్టీపీసి లేబర్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కుటుంబం కర్మాగారాలు తీసుకువస్తే బీఆర్ఎస్ నాయకులు అందులో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం చేపడుతానని చెప్పారు. 

 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్పలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే భారీ మెజారిటీతో వంశీని గెలిపించాలని కోరారు.  ప్రజలను మోసం చేసే వ్యక్తి మోదీ అని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మోదీ అంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.