పిల్లలు తినకపోతే.. ఏం చేయాలంటే?

V6 Velugu Posted on Sep 10, 2021

ఏడాది నుంచి రెండేళ్ల వయసు పిల్లల్లో ఫుడ్​ తినకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. జలుబు, దగ్గు లేదా ఫుడ్​ అరగకపోవడం వల్ల కూడా పిల్లలకి ఫుడ్​ తినాలనిపించదు.  రోజంతా ఆటలు ఆడుకుని అలసిపోతారు. అలాంటప్పుడు ఫుడ్ తినాలనే మూడ్​లో ఉండరు. పెద్దవాళ్లలాగే పిల్లలకి కూడా మూడ్​ ఛేంజెస్​ ఉంటాయి. ఆ టైంలో వాళ్లకి ఫుడ్​ తినాలని అనిపించకపోవచ్చు.

తల్లిదండ్రులు చేయాల్సినవి

  • పిల్లలకి హెల్దీ, న్యూట్రిషియస్​ ఫుడ్​ తినిపించాలని ఆరాటపడడం మంచిదే. అలాగని పిల్లల ఫుడ్​ విషయంలో తల్లిదండ్రులు మరీ స్ట్రిక్ట్​గా ఉండొద్దు. హెల్దీఫుడ్​లో వాళ్లకి ఇష్టమైంది ఎంచుకునే ఛాన్స్​ ఇవ్వాలి.
  • ఫుడ్​ ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాల ఆకారాల్లో, రంగుల్లో ఉండాలి.  న్యూట్రి మఫిన్స్​, దాల్​ పూరీ, రెయిన్​బో కట్లెట్​, పాన్​కేక్స్ వంటివి తినిపించాలి.
  • వంట​ చేస్తున్నప్పుడు పిల్లల సాయం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆ రోజు వంటకి కావాల్సిన పదార్థాలను  వాళ్లనే  సెలక్ట్ చేసుకోనివ్వాలి. ఇలాచేస్తే, ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది.​ తినేటప్పుడు మారాం చేయరు.

Tagged food, kids, parenting tips

Latest Videos

Subscribe Now

More News