
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ‑వెడ్డింగ్ ఫంక్షన్‌లో ముకేశ్ అంబానీ చిందేశారు. ఆయన భార్య నీతా అంబానీతో కలిసి ఐకానిక్ బాలివుడ్ సాంగ్ ‘ఫ్యార్ హువా’ కి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ కోసం ముకేశ్ అంబానీ ట్రెడిషనల్ కుర్తా–పైజామాను, నీతా అంబానీ శారీని ధరించారు.