ఎండ లేకుంటే.. ఎంత తిన్నా వేస్టే 

ఎండ లేకుంటే.. ఎంత తిన్నా వేస్టే 

ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం, ఫాస్పరస్‌‌‌‌‌‌‌‌ తగినంత ఉండాలె. డి– విటమిన్ సరిపోయేంత లేకుంటే పేగులు క్యాల్షియాన్ని పీల్చుకోవు. క్యాల్షియం లోపం అనగానే ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు క్యాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నరు.

ఎముకలు బలపడేందుకు, పిండం ఎదుగుదల కోసం గర్భవతులు, పిల్లల పెరుగుదల కోసం పాలిచ్చే తల్లులు క్యాల్షియం మాత్రలు తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం ఎంత తిన్నా ప్రయోజనం ఉండదు. వాటిని తీసుకుంటూ పొద్దుటి ఎండలో నడిస్తేనే ప్రయోజనం ఉంటది.

డాక్టర్‌‌‌‌‌‌‌‌ చిలువేరు రవీందర్‌‌‌‌‌‌‌‌