Sunrisers Hyderabad: మరో రెండు గంటల్లో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పోటీ పడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో ప్రారంభించాలని రెండు టీమ్స్ చూస్తున్నాయి. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2018, 2024 సీజన్లలో ఫైనల్ వరకు వచ్చిన బోల్తా పడింది. ఈ క్రమంలో పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. దీంతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ ను ఐపీఎల్ 2026 వేలంలో రూ. 13 కోట్లకు సొతం చేసుకుంది.
బ్యాటింగ్ లో టాప్:
ఇక రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పితో ప్రారంభ మ్యాచులకి దూరం అయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బరిలోకి దిగబోతుంది. ఇషాన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్‌కుమార్ రెడ్డితో కూడిన విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌తో ప్రత్యర్థి జట్లని భయపెడుతుంది. గత సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మూడుసార్లు అత్యధిక పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టింది.
►ALSO READ | RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారంటే..!
బౌలింగ్ లో వీక్:
ఐపీఎల్‌లోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బౌలింగ్ విభాగం తీవ్రంగా కలవర పెడుతుంది. గతేడాది లీగ్ దశ నుంచి ఎస్ ఆర్ హెచ్ వైదలగడానికి ప్రధాన కారణం బౌలింగ్ విభాగం వీక్ గా ఉండటమే. బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలర్ లేకపోవడం ఆ జట్టుకి మైనస్ గా మారింది. బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తున్నప్పటికీ, బౌలర్లు ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక కెప్టెన్ కమిన్స్ ఈ సీజన్‌లో ఫస్టాప్ దూరమవడంతో ఆ జట్టు బౌలింగ్ మరింత బలహీన పడింది.
ఈ ఎడిషన్‌లో పేసర్లు.. కమిన్స్ లేని లోటును బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనద్కత్ ఏ విధంగా భర్తీ చేస్తారు?.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్లను ఏ మేరకు కట్టడి చేస్తోరో అన్నది వేచి చూడాలి. జీషన్ అన్సారి, శివాంగ్‌కుమార్, హర్ష్ దూబె, క్రెనిస్ పులెట్రా ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. అయినా కూడా మిగిలిన టీమ్స్ తో పోలిస్తే ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ చాలా వీక్ గా కనిపిస్తుంది.
