ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌కు బదులు..
ఇండిపెండెంట్ వ్యవస్థకు ఇస్తే మేలు
పార్లమెంటుకు సూచించిన సుప్రీంకోర్టు
ఆలోచించాలని పార్లమెంటుకు సూచించిన సుప్రీంకోర్టు
ఒక రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉండే స్పీకర్.. ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశంపై వివాదాలు చెలరేగుతున్నాయ్.. స్పీకర్ కు బదులుగా ఇండిపెండెంట్ లేదా పర్మనెంట్ బాడీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై డిస్ క్వాలిఫికేషన్ పై స్పీకర్ కు ఉన్న అధికారాలపై మళ్లీ ఒకసారి చర్చించాలని పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేసే అంశంపైనా ఆలోచించాలని చెప్పింది. ఒక రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉండే స్పీకర్.. అనర్హత వేటు విధించే అంశంపై వివాదాలు చెలరేగుతున్నాయని.. స్పీకర్ కు బదులుగా ఇండిపెండెంట్ లేదా పర్మనెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ ఆధ్వర్యంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ సూచించింది. ఇటీవల నమోదవుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుని ఈ సూచన చేసినట్లు చెప్పింది.
మూడు నెలల్లో తేల్చాలి
పార్టీ ఫిరాయింపు లాంటి విషయాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఒక్క రోజు కూడా వాళ్లు పదవిలో కొనసాగరాదని తేల్చి చెప్పింది. మణిపూర్ అటవీ శాఖ మంత్రి తౌనావోజమ్ శ్యామ్ కుమార్ డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన శ్యామ్ కుమార్ అధికార పార్టీ బీజేపీలో చేరారని, ఆయనపై వేటు వేయాలని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పిటిషన్లను పెండింగ్ లో పెట్టారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హత పిటిషన్ల పై స్పీకర్ కాలయాపన సరికాదని, మూడు నెలల్లో తేల్చాలని అభిప్రాయ పడిన సుప్రీంకోర్టు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ స్పీకర్ ను ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే ఎమ్మెల్యేలు మరోసారి కోర్టుకు రావొచ్చని సూచించింది.
see also: దగ్గరుండి కటింగ్ చేయించిన తల్లి.. ఉరేసుకున్న కొడుకు
