ప్రభుత్వ స్కూళ్లలో టీచర్‌గా చేరాలంటే టెట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరీ చేశాయి. దాంతో టీచర్ కావాలనుకునే ప్రతిఒక్కరూ టెట్ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నారు. అయితే ఆ క్వాలిఫై టైంను ఏడు సంవత్సరాలుగా పేర్కొంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2011లోనే చెప్పింది. అయితే ఆ ఏడు సంవత్సరాల వ్యాలిడిటీని లైఫ్ లాంగ్ పెంచుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ ట్వీట్ చేశారు. అదేవిధంగా 2011 నుంచి క్వాలిఫై అయిన అభ్యర్థులకు కొత్త సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశించారు. అంతేకాకుండా.. కాలపరిమితి ముగిసిన వారికి కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీతో కొత్త సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలను పెంచనుంది. స్టేట్, సెంట్రల్ టెట్ రెండింటికి ఈ రూల్ వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
