గవర్నర్ స్పందించకపోతే గ్రౌండ్ లో పోరాటం

గవర్నర్ స్పందించకపోతే గ్రౌండ్ లో పోరాటం
  • ఐఏఎస్ లు అటెండర్ల కంటే అధ్వాన్నంగా పనిచేస్తున్నారు
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి 

సంగారెడ్డి: రాష్ట్రంలో అధ్వాన్న పాలనపై గవర్నర్ కు లేఖ రాశామని.. గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే గ్రౌండ్ లో పోరాటాలు షురూ చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. కొందరి పనితీరు వల్ల పోలీసు శాఖ అధ్వాన్నంగా తయారైందని.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభియోగం 2లక్షలు.. కానీ పోలీసులు హింసించి చంపారని, తెలంగాణ లో హోమ్ మినిస్టర్ చెప్పినా  హోమ్ గార్డ్ కూడా వినే పరిస్థితి కనిపించడం లేదని ఆయన విమర్శించారు. 
కొందరు పోలీస్ శాఖలో వుండే చెత్త మనుషుల వల్లే పోలీస్ శాఖ అద్వానంగా మారిందని, వారి ప్రమోషన్లు, పోస్టింగుల కోసం ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట, కామారెడ్డి కలెక్టర్లు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నారని, మరి కొందరు ఐఏఎస్ అధికారులు అటెండర్ల కంటే అద్వానంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సర్కార్ లో దోపిడీ చేసే వాళ్ళు కనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు.