
రైతు చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకోవడం మా విజయమని చెప్పుకుంటున్న కేసీఆర్.. వీలైతే వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని వైఎస్ షర్మిల అన్నారు. తాము ధర్నా చేయడం వల్లే కేంద్రం రైతు చట్టాలను వెనుకకు తీసుకుందని టీఆర్ఎస్ చెప్పుకోవడం దారుణమని ఆమె అన్నారు. మంచి జరిగితే తామే చేసినట్లు.. చెడు జరిగితే పక్కొడిని అనడం టీఆర్ఎస్కు అలవాటే అని ఆమె ఆరోపించారు.
‘మూడుగంటల ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్దు చేయించామని జబ్బలు చరుచుకొంటున్న కేసీఆర్ గారు.. మీరు అంత మొనగాళ్లైతే 6 గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చెయ్యండి. మంచి జరిగితే మీ అకౌంట్లో.. లేకుంటే పక్కోని మీద బట్టకాల్చేయడం మీకు అలవాటేగా!!’ అని షర్మిల ట్వీట్ చేశారు.
మూడుగంటల ధర్నా చేసి ..
— YS Sharmila (@realyssharmila) November 20, 2021
రైతు చట్టాలను రద్దు చేపించామని జబ్బలు చర్చుకొంటున్న కెసిఆర్ గారు ..
మీరు అంత మొనగాళ్లైతే 6 గంటలు ధర్నా చేసి
రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చెయ్యండి.
మంచి జరిగితే మీ ఎకౌంట్లో .. లేకుంటే పక్కోని మీద బట్టకాల్చి మీదేయడం మీకు అలవాటేగా !! #KCRDramaDharna